
ప్రముఖ వర్సిటీలో పెరిగిన లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో ఎన్నడూ లేనంతగా లైంగిక వేధింపుల ఫిర్యాదులు పెరిగిపోయాయి. ఒక్క 2015-16లోనే 39 లైంగిక వేధింపుల ఫిర్యాదులు నమోదైనట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో లైంగిక వేధింపుల సంఘటనలు జరిగినట్లు నమోదుకావడం ఇదే తొలిసారి అని చెప్పారు.
వీటిల్లో గ్రాడ్యుయేట్ స్థాయి నుంచి వచ్చిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. యూనివర్సిటీలో ఎన్ని లైంగిక వేధింపుల ఫిర్యాదులు నమోదయ్యాయనే విషయంపై ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు ప్రతి యూనివర్సిటీ ఒక నివేదిక రూపంలో ఇస్తుంది. అందులో భాగంగా గత ఏడాది జేఎన్ యూ ఇచ్చిన నివేదికలో 26 ఫిర్యాదులు, అంతకుముందు 2013-14 లో 25 ఫిర్యాదులు అందగా ఈ 2015-16లో మాత్రం అవికాస్త 39కి పెరిగాయి.