కోల్‌కత : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్, వామపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. ధర్నాలు, రాస్తారొకోలకతో తమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్త ఎన్నార్సీ, పౌరసత్వ చట్టం, కేంద్ర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే నిరసనలకు మద్దతు నిస్తామని అన్నారు. అయితే, దేశ వ్యాప్తంగా ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేపట్టని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు.. బెంగాల్లో మాత్రం అనిశ్చితి పెంచేందుకు ఇతర కారణాలను చూపుతూ ధర్నాలకు దిగుతున్నాయని విమర్శించారు. రాజకీయంగా ఉనికి కోల్పోయిన పార్టీలే ఇక్కడ ‘పోరాట’ పంథా ఎన్నుకున్నాయని ఎద్దేవా చేశారు. తమ ఉనికి నిలుపుకోవడానికే ధర్నాల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment