'జేఎన్‌యూ విద్యార్థులు ఏం చేశారంటే..' | JNU students use 3000 condoms and eat meat, says BJP MLA | Sakshi
Sakshi News home page

'జేఎన్‌యూ విద్యార్థులు ఏం చేశారంటే..'

Published Tue, Feb 23 2016 10:31 AM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

'జేఎన్‌యూ విద్యార్థులు ఏం చేశారంటే..' - Sakshi

'జేఎన్‌యూ విద్యార్థులు ఏం చేశారంటే..'

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

జైపూర్: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. జేఎన్యూ తన పూర్వవైభవాన్ని కోల్పోయిందని, వర్సిటీ ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా వ్యాఖ్యానించారు. సాంస్కృతిక వేడుకల నెపంతో రాత్రిళ్లు అక్కడ జరిగే పనులు చాలా దారుణంగా ఉంటాయన్నారు.

రాత్రి వేళల్లో వర్సిటీలో కండోమ్స్ వాడకం ఎక్కువగా ఉంటుందని, గర్భనిరోధక ఇంజెక్షన్స్ వాడకం కూడా విపరీతంగా ఉందని పేర్కొన్నారు. 3వేల బీర్ బాటిల్స్ అక్కడ పడి ఉంటాయని, వాటిని వర్సిటీ ప్రాంగణంలో ఎవరు తాగి ఉంటారో మీరే చెప్పండి అంటూ మండిపడ్డారు. వీటితో పాటు 10 వేల సిగరెట్ పీకలు మనం చూడొచ్చని, చికన్ ముక్కలకు అక్కడ కొదవ ఉండదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటువంటి పనులు చేస్తున్నవారిని జాతి తిరుగుబాటుదారులు అనకూడదా అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement