'జేఎన్ యూలో రేప్లు నిత్యకృత్యం' | Rapes happen daily in JNU, says Gyandev Ahuja | Sakshi
Sakshi News home page

'జేఎన్ యూలో రేప్లు నిత్యకృత్యం'

Published Wed, May 25 2016 1:32 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

'జేఎన్ యూలో రేప్లు నిత్యకృత్యం' - Sakshi

'జేఎన్ యూలో రేప్లు నిత్యకృత్యం'

జైపూర్: ఢిల్లీ జేఎన్ యూ క్యాంపస్ లో అత్యాచారాలు నిత్యకృత్యమని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహుజ స్పష్టం చేశారు. నేర కార్యకలాపాలకు జేఎన్ యూ స్థావరంగా మారిందని ఆయన బుధవారం పునరుద్ఘాటించారు.

జేఎన్ యూ విద్యార్థులు క్యాంపస్ లో విచ్చలవిడిగా వ్యవహరిస్తారని గతంలో అహుజ వ్యాఖ్యానించారు. జేఎన్ యూ క్యాంపస్ లో ప్రతిరోజు 3 వేల కండోమ్ లు, గర్భనిరోధక ఇంజక్షన్లు వాడతారని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో 50 శాతం అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులకు జేఎన్ యూ విద్యార్థులే కారణమని దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనప్పటికీ ఆయన వెనక్కు తగ్గలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement