న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ఆమోదం లేకుండా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఇతరులపై చార్జిషీట్ దాఖలు చేయడంపై ఢిల్లీ కోర్టు పోలీసులను తప్పుబట్టింది. ‘ఆమోదం లేకుండా ఎలా మీరు చార్జిషీట్ దాఖలు చేశారు. మీకు న్యాయ సలహాలు ఇచ్చే శాఖ లేదా’ అని పోలీసులను ప్రశ్నించింది. దీనిపై పోలీసులు సమాధానమిస్తూ.. మరో 10 రోజుల్లో ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతి తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ ఫిబ్రవరి 6వ తేదీ వరకు పోలీసులకు గడువు ఇచ్చారు. కన్హయ్య కుమార్ 2016 ఫిబ్రవరిలో జేఎన్‌యూలో దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ పోలీసులు జనవరి 14న చార్జిషీట్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment