లాల్‌ ఎత్తు ఒక సందేహంగా ఉండిపోయింది.. | Mizoram CM Post Lieutenant Lalhmachhuana Photo Viral | Sakshi
Sakshi News home page

పెద్ద గీతలు

Published Fri, Jun 19 2020 8:01 AM | Last Updated on Fri, Jun 19 2020 8:01 AM

Mizoram CM Post Lieutenant Lalhmachhuana Photo Viral - Sakshi

లెఫ్టినెంట్‌ లాల్‌ మచ్చువానా (మధ్యలో)

లెఫ్టినెంట్‌ లాల్‌ మచ్చువానా భారత సైన్యంలోని శతఘ్నిదళంలోకి ప్రమోట్‌ అవడం అతడి సొంత రాష్ట్రమైన మిజోరాం ప్రజలకే కాదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంథంగాకూ ఎంతగానో ఆనందించే విషయం అయింది. అయితే ఆ ఆనందంలో ఆయన ట్వీట్‌ చేసిన ఫొటో మాత్రం దేశంలోని ఇతర ప్రాంతాల వారికి ఆసక్తిని మాత్రమే కలిగించింది. ఆ ఫొటోలో ఇద్దరు పొడవాటి ఆఫీసర్ల మధ్య ఉన్న లాల్‌ మచ్చువానా.. సైన్యానికి అవసరమైన కనీస ఎత్తులో కూడా లేనట్లుగా కనిపించడమే అందుకు కారణం. 6.5, 6.3 అడుగుల ఎత్తు ఉన్న ఆ ఇద్దరి మధ్య 5.5 అడుగుల ఎత్తున్న లాల్‌.. సైన్యానికి ఏమాత్రం తగని వ్యకిలా కనిపిస్తున్నప్పటికీ సైన్యానికి కనీస అర్హత అయిన 5.2 ఎత్తుకు మించి ఉన్నట్లు మీడియా వెళ్లి ఆయన్ని అడిగేవరకు దేశానికి ఒక సందేహంగా ఉండిపోయింది. ముఖ్యమంత్రి పోస్ట్‌ చేసిన ఆ ఫొటో గతంలో డెహ్రాడూన్‌ లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో లాల్‌ తన కో–ఆఫీసర్స్‌ తో కలిసి తీయించుకున్నది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement