అదే పిచ్చితో 19వ సర్జరీ
స్వీడన్: ఆమె వయసు 26 ఏళ్లు. ఇప్పటికి పందొమ్మిది కాస్మోటిక్ సర్జరీలు పూర్తి చేసుకుంది. ఇవన్నీ కూడా ఆమె అందాన్ని మరింత అందంగా చూపించడానికే. స్వీడన్కు చెందిన ఈ మోడల్ చేసే హంగామా అంతా ఇంత కాదు.. ఆవివరాలేమిటో పరిశీలిస్తే.. పిక్సీ ఫాక్స్ అనే ఉత్తర కరోలినాకు చెందిన 26 ఏళ్ల మహిళ స్వీడన్ మోడల్గా పనిచేస్తోంది. ఆమెకు అందంపై ఉన్న శ్రద్ధ ఒక్కసారి గమనిస్తే ఎంతో ఆశ్చర్యపోతారు. నిత్యం తళుక్కున మెరిసేందుకు ఆమె ఎలాంటి సాహసమైనా చేయలేదు.
అందుకోసం ఎంతటి ఖర్చయినా భరించగలదు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత సన్నటి నడుంగల యువతిగా పేరు సంపాదించుకోవాలని ఉవ్విళూరుతున్న ఆమె ఇప్పుడు మరో కొత్త సాహసం చేసింది. తన కళ్లు గ్రీన్ కార్టూన్ కలర్ లో మెరిసి పోవాలని దాదాపు 80 వేల ఫౌండ్లు ఖర్చు చేసింది. అయితే, ఇలా చేయడం ఆమెకు కొత్తేం కాదంట. ప్రతి ఏడాది తన కళ్ల రంగును నచ్చినట్లు ఇలా లక్షలు పోసి మార్పించుకుంటానని ఆమె స్వయంగా చెప్పింది. మరింత ఆశ్చరకరమైన విషయం ఏమిటంటే.. ఇసుక గడియారం చూసే ఉంటారుగా.. అచ్చం అంత సన్నగా తన నడుము ఉండాలని ఏకంగా ఆమె ఆరు పక్కటెముకలు తీయించుకుంది. ఇప్పుడేమో కళ్లు. మున్ముందు ఇంకెన్ని సర్జరీలు చేయించుకుంటుందో చూడాలి. (చదవండి.. 'సైజ్ జీరో' కోసం పక్కటెముకలు తీయించుకుంది!)