మేకప్ లేకుండా చూసి విడాకులిచ్చేశాడు!
దుబాయ్: భార్యను మొదటిసారిగా మేకప్ లేకుండా చూసి విడాకులిచ్చాడు ఓ భర్త. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఈ కొత్త జంట షార్జాలోని అల్ మంజర్ బీచ్‌లో ఈతకెళ్లింది. స్విమ్మింగ్ అనంతరం మేకప్ లేని తన భార్య సహజమైన ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయాడు భర్త. ఆమెను చూసి గుర్తించలేకపోయాడు. పెళ్లి సమయంలో నకిలీ కనురెప్పలు, మేకప్‌తో అందంగా కనిపించిందన్నారు. పెళ్లికి ముందు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడమే కాకుండా కృత్రిమ కనురెప్పలు వాడేదానినని భార్య తెలిపింది. భర్తకు ఈ సంగతి చెప్పాలనుకున్నానని, అయితే అంతలోపే విడాకులిచ్చేశాడని వెల్లడించింది.