శ్రీవారిని దర్శించుకున్న క్రిష్ దంపతులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) తన భార్య రమ్యతో కలిసి దర్శించుకున్నారు. వివాహం అనంతం తిరుమల వచ్చిన దంపతులు బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరిద్దరికీ రెండు రోజుల క్రితం వివాహమైన సంగతి తెల్సిందే.