
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
గుంటురు: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన దురదృష్టకరమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... హత్య కేసులో పోలీసులు వెంటనే స్పందించారని తెలిపారు. నిందితుడు శశికృష్ణను అరెస్టు చేసే సమయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు స్పందించిన తీరుపై ఎస్సీ కమిషన్ సైతం ప్రశంసించిందని అన్నారు. కాగా, వార్తలు ప్రచురించే విషయంలో తొందరపాటు వద్దని పేర్కొన్నారు.
చదవండి: గుంటూరులో పట్టపగలు దారుణం.. ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య
చదవండి: మీడియా ముందుకు బీటెక్ విద్యార్థిని హత్యకేసు నిందితుడు
Comments
Please login to add a commentAdd a comment