
నటి రమ్య వాహనంపై కోడిగుడ్లతో దాడి
మంగళూరు: ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత రమ్యపై గురువారం దాడి జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై కొందరు దుండగులు కోడి గుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. తనపై దాడి చేసింది ఎవరో తనకు తెలియదని రమ్య పేర్కొన్నారు.
కాగా పాకిస్తాన్ గురించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రమ్యపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఆమెపై దేశద్రోహం కేసు కూడా నమోదు అయింది. శత్రుదేశమైన పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన రమ్యపై సెక్షన్ 124/ఎ, 334ల కింద కొడగు జిల్లా సోమవార పేటలోని జేఎంఎఫ్‌సీ కోర్టులో ప్రైవేటుగా దేశద్రోహం కేసు దాఖలైంది.