
యశవంతపుర : శాండిల్‌వుడ్ నటి, మాజీ ఎంపీ రమ్య రాజకీయాలకు, సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. తన చిన్ననాటి స్నేహితుడు రఫెల్‌ను వివాహం చేసుకుని దుబాయిలో స్థిరపడాలని నిర్ణయించకున్నట్లు సమాచారం. ఆమె వివాహంపై సామాజిక మాధ్యమాలలో జోరుగా చర్చ సాగుతోంది. కన్నడ చిత్రసీమలో ప్రముఖుల సరసన నటించిన రమ్య 2013లో మండ్య లోకసభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు.