బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె ప్రస్తుతం తీవ్ర వమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం పఠాన్ చిత్రం నుంచి ఇటీవల విడుదల బేషరమ్ రంగ్ పాటలో దీపికా వస్రధారణపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పెళ్లయిన దీపికా బికిని దర్శించడంతో మహిళా సంఘాలు, నెటిజన్లు దీపికాను తిట్టి పోస్తున్నారు. ఈ పాటను తీసేయాలని, లేదంటే మూవీని బ్యాన్ చేస్తామంటూ డిమాండ్ వ్యక్తం అవుతున్నారు. అయితే అంతా దీపికా తీరు వ్యతిరేకిస్తూ ఆమెను విమర్శిస్తున్న నేపథ్యంలో ఓ నటి దీపికాకు మద్దతుగా నిలిచింది.
చదవండి: విషాదం.. అవతార్ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి
ఆ నటి ఎవరో కాదు ప్రముఖ కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు రమ్య. ఈ మేరకు రమ్య ట్వీట్ చేస్తూ.. స్త్రీ ద్వేషంతోనే పలువురు దీపికాను ట్రోల్ చేస్తున్నారని, స్త్రీ వ్యతిరేకతపై ఎదురు తిరగాల్సిన అవసరం ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు ఈ సందర్భంగా రమ్య.. సమంత, సాయి పల్లవి, రష్మీక మందన్నా గురించి కూడా ప్రస్తావించింది. ‘విడాకులు తీసుకుందనే కారణంతో అప్పట్లో సమంతను ట్రోల్ చేశారు. తన అభిప్రాయాన్ని బయటపెట్టిందని సాయి పల్లవిని, ఓ నటుడిని నుంచి విడిపోయిందని రష్మీకను ట్రోల్ చేశారు.
ఇప్పుడు కురచ దుస్తులు వేసుకుందని దీపికాను విమర్శిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మహిళలు ఇలాంటి చిన్న చిన్న కారణాలకే ద్వేషాన్ని ఎదుర్కొంటున్నారు. ఇష్టమైన వాటిని ఎంచుకోవడమే మన ప్రథమ హక్కు. మహిళలు దుర్గాదేవి రూపాలే అంటారు కదా. ఇక స్త్రీ ద్వేషం అనే రాక్షసుడిపై పోరాటం చేయాల్సి అవసరం ఉంది’ అంటూ రమ్య తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. ఇక రమ్య ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రష్మీకకు ఆమె మద్దతు తెలపడం నెటిజన్లు తీవ్రంగా మండి పడుతున్నారు.
చదవండి: సోషల్ హల్‌చల్: జాన్వీ కపూర్ బ్యూటీ.. రెడ్ డ్రెస్‌లో కియారా లుక్స్
రష్మిక.. రెస్పాక్ట్‌కు అనర్హురాలని, తనకు అవకాశాలు ఇచ్చి, స్టార్ చేసిన కన్నడ పరిశ్రమ, ప్రొడక్షన్ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు, అలాంటి ఆమెకు కన్నడలోనే కాదు ఎక్కడ గౌరవం ఉండదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే బేషరమ్ రంగ్ పాటలో పూర్తిగా వల్గారిటీ ఉందని ప్రతి ఒక్కరు అంటున్నారని, అది కేవలం స్ట్రీ ద్వేషంతో వస్తుందని కాదంటూ’ కామెంట్స్ చేస్తున్నారు. కాగా కన్నడలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన రమ్య కళ్యాణ్ రామ్ అభిమన్యుడు మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది.
Samantha trolled for her divorce, Sai Pallavi for her opinion,Rashmika for her separation, Deepika for her clothes and many, many other women for pretty much EVERYTHING. Freedom of choice is our basic right. Women are the embodiment of Maa Durga- misogyny is an evil we must fight
— Ramya/Divya Spandana (@divyaspandana) December 16, 2022
Comments
Please login to add a commentAdd a comment