అవమానభారంతో బాలిక ఆత్మాహుతి
యువకుడు మోసం చేశాడనే మనస్తాపం..
ముస్తాబాద్ : ప్రేమిస్తున్నానని చెప్పి ఇంటినుంచి హైదరాబాద్ తీసుకెళ్లాడు ఓ ప్రబుద్ధుడు.. సర్టిఫికెట్లు పరిశీలించి మైనారిటీ తీరలేదని, వివాహం చేసుకోబోనని తేల్చిచెప్పాడు. దీనిని అవమానభారంగా భా వించిన ఆరుట్ల రమ్య(17) ఒంటిపై కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడి చనిపోరుుంది. ఎస్సై ప్రవీణ్, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన అరుట్ల ఆండాలు- రాజిరెడ్డి దంపతుల కూతురు రమ్య. ఇదేగ్రామానికి చెందిన బొంగోని పవన్ ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి ఈనెల 25న రమ్యను హైదరాబాద్ తీసుకెళ్లాడు. అక్కడ రమ్య సర్టిఫికెట్లు పరిశీలించిన పవన్.. మైనారిటీ తీరలేదని, వివాహం చేసుకోవడం కుదరదని ఆమెకు చెప్పాడు. అంతేకాదు.. తాము నివాసం ఉంటున్న ప్రాంతం చిరునామాను ఆమె బంధువులకు చేరవేశాడు.
వారు హైదరాబాద్ వెళ్లి బాలికను ఈనెల 26న ముస్తాబాద్ తీసుకొచ్చారు. అప్పట్నుంచి రమ్య మనోవేదనతో ఉంటోంది. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు డబ్బుల కోసం బ్యాం కుకు వెళ్లారు. ఒంటరిగా ఉన్న బాలిక బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తొంబైశాతం కాలిపోరుుంది. మంటల్లో చిక్కుకుని కేకలు వేయగా స్థానికులు వెంటనే ఇంట్లోకి వచ్చి చూశారు. అప్పటికే బాలిక విగతజీవిగా మారింది. సీఐ శ్రీదర్, ఎస్సై ప్రవీణ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రమ్య ఆత్మహత్యకు కారణమైన బొంగొని పవన్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.