గుర్రాల వ్యాపారం జరుగుతోంది : రమ్య | Ramya Fires On BJP Karnataka Politics | Sakshi
Sakshi News home page

గుర్రాల వ్యాపారం జరుగుతోంది : రమ్య

Published Thu, May 17 2018 8:54 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Ramya Fires On BJP Karnataka Politics - Sakshi

రమ్య

యశవంతపుర: రాష్ట్ర రాజకీయాలలో గుర్రాల వ్యాపారం ప్రారంభమైంది అని నటి, కాంగ్రెస్‌ నాయకురాలు రమ్య ఆరోపిస్తూ ట్వీట్‌ చేశారు. కేంద్ర మంత్రి  పీయూశ్‌ గోయల్‌ గత గుజరాత్‌ ఎన్నికలలో కూడా అనేకమంది ఎమ్మెల్యేలను వ్యాపారుల చేత కొనుగోలుకు యత్నించారన్నారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే మాదిరిలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ ఎమ్మెల్యేలను గుర్రాల వ్యాపారంలో మాదిరి కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.

ఆపరేషన్‌ కమలానికి మా ఎమ్మెల్యేలు లొంగరు

ఆపరేషన్‌ కమలానికి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు లొంగరని కాంగ్రెస్‌ సీనియర్‌  నేత గులామ్‌ నబి ఆజాద్‌ పేర్కొన్నారు. నిన్న ఆయన మాట్లాడుతూ... బీజేపీ ఇప్పటికే కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను సంప్రదించి ప్రలోభాలకు తెరలేపిందన్నారు. అయితే తమ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లోనుకాలేదన్నారు. దేవగౌడ, కుమారస్వామిలకు వారి ఎమ్మెల్యేలపై విశ్వాసం ఉందని, వారు ఆపరేషన్‌ కమలానికి అవకాశం కల్పించరనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement