
నటి రమ్యా
కర్ణాటక, బొమ్మనహళ్లి : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన భజరంగి భాయ్‌జాన్ సినిమాలో చిన్నపాపను పాకిస్తాన్‌కు తీసుకుని వెళ్లినట్లు కన్నడ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రమ్యను కూడా పాకిస్తాన్‌లో వదిలి రావాలని కన్నడ ప్రజలు ఆమెపై ట్వీట్లు చేస్తున్నారు. ఏఐసీసీ సోషల్ మీడియా ప్రముఖురాలిగా ఉన్న రమ్య దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల భారత్, పాక్ పరిణామాల నేపథ్యంలో రమ్య భారత్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టడంపై కన్నడిగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమెను పాకిస్తాన్‌లో విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment