
సినీ నటుడు నరేష్ ఇంటిపై దుండగులు దాడి చేశారు. గచ్చిబౌలిలోని ఆయన ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడి కారును ధ్వంసం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన నరేష్.. తన మూడో భార్య రమ్య రఘుపతి దాడి చేయించిందని ఆరోపించాడు.
నరేష్ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా గత కొన్నిరోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న నరేష్ ఇటీవలె తన మూడో భార్య రమ్యపై సంచలన ఆరోపణలు చేశారు.
ఆస్తి కోసం తనను చంపేందుకు రమ్య ప్రయత్నించిందని, ఇంటివద్ద రెక్కీ కూడా నిర్వహించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటిపై దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment