సినీ నటుడు నరేశ్ కొంతకాలంగా తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా నటి పవిత్రా లోకేశ్‌కు దగ్గరైన ఆయన ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసిన జంట మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
రమ్య మాట్లాడుతూ..' నరేశ్ డివోర్స్ కావాలని పిటిషన్ వేశారు. అదే నాకు పెద్ద ఆధారం. నేను కూడా అలిగేషన్స్ వేశా. నేను ఏం అలిగేషన్స్ వేశానో ఆధారాలు ఉన్నాయి. ఆరు నెలలైనా ఇంతవరకు నాపై చేసినా ఆరోపణలు నిరూపించలేకపోయారు. డివోర్స్ కేసు కోర్టులో ఉండగా మాట్లాడటం సరికాదు. చైల్డ్ గార‍్డియన్ షిప్, నా మీద ఇంజక్షన్ ఆర్డర్ ఫైల్ చేశారు. నాపై రకరకాలుగా కేసులు వేశారు. నేను వీటన్నింటినీ ఎదుర్కొంటున్నా. నేను వేసిన ఒకే ఒక కేసు డొమెస్టిక్ వయోలెన్స్. నాకు, నా కుమారుడికి మెయింటనెన్స్ కావాలని వేశా. నా మీద ఆరోపణలు చాలా వచ్చాయి. ఆస్తి కోసం ఆమె ఇలా చేస్తోంది అని అన్నారు. నాకు నా పిల్లాడి జీవితం ముఖ్యం. అందుకే పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నా. ఫైనల్‌గా నాకు విడాకులు వద్దనేదే నా నిర్ణయం.' అని అన్నారు.
ఇటీవల వీడియోపై ఆమె మాట్లాడుతూ..' ఒక భార్యగా ఆయన నన్ను టీజ్ చేస్తున్నారు. ఆ వీడియోను రెండుసార్లు మాత్రమే చూశా. నా బాబుకు సెక్యూరిటీ ఇవ్వడమే నా లక్ష‍్యం. నేను ఎక్కడా తప్పు చేయలేదు. అలాంటప్పుడు నాపై నిందలు వేస్తే సహించను. నరేశ్ దగ్గరికి పవిత్ర రావడానికి కేవలం ఆర్థిక పరమైన కారణాలే. నరేశ్‌ను ఎవరితోనైనా ఉన్నప్పుడు నేను పట్టుకుంటే రెండు నెలలు నాతో బాగా ఉంటారు. ఆ సమయంలో ఇంట్లో అడిగేవారు ఎవరూ లేకపోవడంతో పవిత్ర దగ్గరైంది. గతంలో కూడా ఆయనకు ఎఫైర్స్ ఉండేవి. మా అత్త నాకు సర్ది చెప్పేవారు. నరేశ్ ఎప్పటికైనా మారుతారని చెప్పేది. ఆయన ఎలాంటి వారనేది మా ఫ్యామిలీకి చెప్పలేదు. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఇది పూర్తిగా నా సమస్య. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. నేను ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నా. న్యాయస్థానంలోనే తేల్చుకుంటా.' అని రమ్య రఘుపతి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment