
కొద్ది రోజుల క్రితం వార్తల్లో నిలిచిన జంట పవిత్ర-నరేశ్. వీరిద్దరి మధ్య సహజీవనం చేస్తున్నట్లు మొదట రూమర్లు పెద్దఎత్తున వైరలయ్యాయి. వాటిని నిజం చేస్తూ ఈ జంట ఓ హోటల్‌లో ఉండగా నరేశ్ మూడో భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో పవిత్ర-నరేశ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టాక్ నడిచింది. వీరిద్దరు ఓ ఆలయంలో కనిపించడంతో అంతా నిజమే అనుకున్నారు. కాగా.. నరేశ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే.
(చదవండి: సైబర్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేశ్)
తాజాగా మరో వార్త గుప్పుమంటోంది. నరేశ్- పవిత్రను కూడా దూరం పెట్టినట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ జంట ఎక్కడా బయట కనిపించడం లేదు. కొందరు సన్నిహితుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు నెట్టింట‍్లో వైరలవుతున్నాయి. అంతే కాదండోయ్ నరేశ్ మరో సీనియర్ నటితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు టాక్. అందువల్లే పవిత‍్రకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అయితే టాలీవుడ్‌లో మరోసారి వీరిద్దరు తెరపైకి రావడం హాట్ టాపిక్‌గా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment