
సీనియర్ నటుడు నరేశ్- రమ్య రఘుపతి వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టుకెక్కాడు నరేశ్. తన మూడో భార్య రమ్య సుపారీ ఇచ్చి హత్య చేయించాలని ప్రయత్నిస్తోందన్నాడు. తనను చంపేందుకు రాకేశ్ శెట్టితో ఇంటి దగ్గర రెక్కీ చేయించిందని కోర్టులో పిటిషన్ వేశాడు. తన ఫోన్ హ్యాక్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తోందన్నాడు.
రమ్య వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, ఆమె నుంచి విడాకులు కావాలని కోరుతున్నాడు. పెళ్లైన నెల నుంచే తనను వేధించేదని, కనీసం తనకు తినడానికి తిండి కూడా పెట్టేది కాదన్నాడు. ఏదైనా ఫంక్షన్ జరిగితే తాగి రచ్చ చేసేదని చెప్తున్నాడు. తనపై కంటే తన ఆస్తి, డబ్బుపైనే రమ్యకు ప్రేమ ఎక్కువంటున్నాడు. మరోవైపు రూ.10 కోట్ల రూపాయలతో సెటిల్‌మెంట్ చేసుకునేందుకు రెడీ అంటూ రమ్య మాట్లాడిన ఆడియో లీక్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment