
యశవంతపుర: గౌరీ,గణ్‌శ్ పండుగ సందర్భంగా పుట్టింటికి రావాలంటూ మండ్య మాజీ ఎంపీ రమ్యాకు బీజేపీ నాయకులు పోస్టు ద్వారా కానుకలను పంపారు. ఏడాదిగా అమె జిల్లాలో కనిపిం చడం లేదని, ఎక్కడున్నా మండ్యకు రావాలం టూ పూలు, అరటికాయ, గాజులు, టెంకాయలను పోస్టులో పంపారు. విధానసభ, నగరసభా ఎన్నికలలో ఓటు హక్కు కూడా వినియోగించుకోలేదని, కనీసం వినాయకచవితికైనా మండ్యకు వచ్చి ఇక్కడి ప్రజల కష్టాలను తెలుసుకోవాలని బీజేపీ నాయకులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment