
కేజీయఫ్ 1, కేజీయఫ్ 2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు కన్నడ హీరో యశ్. ఈ మూవీతో అతడు ఒక్కసారిగా నేషనల్ స్టార్‌గా ఎదిగాడు. అయితే యశ్, రమ్య హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన లక్కీ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించింది. దీంతో ఈ మూవీని ఇప్పడు తెలుగులో లక్కీ స్టార్‌గా తెలుగులోకి తీసుకువస్తున్నారు.
కన్నడలో ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నటి రాధికా కుమార్ స్వామి స్వయంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘లక్కీ స్టార్’ చిత్రాన్ని తీసుకువస్తున్నారు. రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. డా.సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లవ్-కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ ‘లక్కీ స్టార్’ ట్రైలర్ విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కాగా ఈ కార్యక్రమంలో నిర్మాత రవిరాజ్, ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చిన గురు చరణ్, సంభాషణల రచయిత సూర్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేశవ్ గౌడ్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ పాల్గొన్నారు. కేజీఎఫ్ స్టార్ యశ్ చిత్రానికి పనిచేసే అవకాశం లభించడం పట్ల గీత రచయిత గురు చరణ్, డైలాగ్ రైటర్ సూర్య సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment