కన్నడ హీరో యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కేజీయఫ్'. ఈ మూవీ మొదటి భాగం ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ ఒక్క సినిమాతో యశ్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవల చిత్రం బృందం తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను బర్త్‌డే బాయ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశాడు. ‘కేజీఎఫ్‌లో గరుడను చంపేసిన తర్వాత ఏం జరిగింది..? మీరు చదువుతారా..?’ అనే సంభాషణలతో షురూ అయింది ట్రైలర్. ‘రక్తంతో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం. ముందుకెళ్లాలంటే మళ్లీ రక్తాన్నే అడుగుతుంది..’అని ప్రకాశ్ రాజ్ చెబుతున్న సంభాషణలు సినిమాను రక్తికట్టించేలా సాగుతున్నాయి. ‘కత్తి విసిరి రక్తం చిందించి యుద్దం చేసేది నాశనానికి కాదు.. ఉద్దరించడానికి’ అంటూ అధీరాగా సంజయ్ దత్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
కాగా ఈ ట్రైలర్ కన్నడ వెర్షన్‌ను స్టార్ హీరో శివరాజ్ కుమార్, హిందీ ట్రైలర్‌ను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్, తమిళ వెర్షన్‌ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ ట్రైలర్‌ను పృథ్విరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. కాగా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ తెరకెక్కిస్తున్న కేజీఎఫ్ 2లో బాలీవుడ్ యాక్టర్లు రవీనా టండన్, సంజయ్ దత్‌తోపాటు కన్నడ నటి శ్రీ నిధి శెట్టి, టాలీవుడ్ నటులు రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment