Yash Toofan Lyrical Song Released From KGF 2 Movie Full Deets Here - Sakshi
Sakshi News home page

KGF 2 Movie: కేజీయఫ్‌ 2 మూవీ నుంచి 'తూఫాన్' లిరికల్ సాంగ్‌ రిలీజ్

Published Mon, Mar 21 2022 12:48 PM | Last Updated on Mon, Mar 21 2022 2:41 PM

Toofan Lyrical Song Released From Yash KGF 2 Movie - Sakshi

Toofan Lyrical Song Released From Yash KGF 2 Movie: కన్నడ హీరో యష్‌ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కేజీయఫ్'. ఈ మూవీ మొదటి భాగం ఎంతటి సూపర్‌ హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ ఒక్క సినిమాతో యష్‌ ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న కేజీయఫ్‌ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పోస్టర్‌లకు విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ ఇ‍చ్చారు మేకర్స్‌.

ఈ కేజీయఫ్ 2 సినిమా నుంచి 'తూఫాన్.. తూఫాన్‌' అనే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. లహరి మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఈ పాటలో రాకీ ధైర్యం గురించి ఒక పెద్దాయన చెబుతాడు. మీకొక సలహా ఇస్తాను.. మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్‌... అంటూ సాంగ్‌ ప్రారంభమవడం ఆకట్టుకుంటోంది. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా అలరించనుంది. ఇతర పాత్రల్లో రావు రమేష్, రవీనా టాండన్, సంజయ్‌ దత్, ప్రకాష్ రాజ్ సందడి చేయనున్నారు. ఈ మూవీని హొంబాలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement