Yash Raraju Movie Trailer Launched By VV Vinayak: ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘సంతు: స్ట్రయిట్ ఫార్వార్డ్’. మహేశ్ రావు దర్శకుడు. ఈ సినిమాను సుబ్బారావు తెలుగులో ‘రారాజు’గా జూన్ ద్వితీయార్ధంలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ – ‘‘పాతికేళ్లుగా పద్మావతి పిక్చర్స్‌పై సుబ్బారావుగారు ఎన్నో సినిమాలను రిలీజ్ చేశారు. ఇప్పుడు యశ్ కేజీఎఫ్‌కు ముందు చేసిన ఈ సినిమాను తెలుగులో 'రారాజు' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు.
‘‘యాక్షన్ ప్రధానాంగా సాగే చిత్రమిది. యశ్, ఆయన భార్య రాధిక పండిట్ కలిసి నటించారు. కన్నడంలో హిట్ సాధించినట్లే తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు నిర్మాత వీఎస్ సుబ్బారావు. ఈ చిత్రంలో కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు నటించారు. ఈ మూవీ హరికృష్ణ సంగీతం అందించగా, ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
చదవండి: అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ
నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్
Comments
Please login to add a commentAdd a comment