కుమార్తెను అత్తింటికి పంపుతూ...
గోపాలపురం, న్యూస్‌లైన్ : ఒక్కగానొక్క కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం ఓ అయ్య చేతిలో పెట్టాడు. తొలి కాన్పు కోసం ఆమెను పుట్టింటికి తీసుకొచ్చాడు. కంటికి రెప్పలా చూసుకున్నాడు. పండంటి మనుమడు పుట్టడంతో మురిసిపోయూడు. ఆరు నెలల అనంతరం చీరసారెలతో ఆమెను సంప్రదాయబద్ధంగా అత్తింటికి తీసుకెళ్లేందుకు కారులో బయలుదేరాడు. నాన్న, బంధువులు వెంటరాగా.. చంటిబిడ్డను ఒడిలో పెట్టుకుని కారులో వెళ్తున్న ఆ యువతి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బరుు్యంది.
వారి సంతోషాన్ని చూసిన విధికి కన్నుకుట్టింది. అప్పటికప్పుడు ప్రమాదాన్ని సృష్టించింది. యువతి తండ్రిని, ఆమె పెద్దమ్మను అనంత లోకాలకు తీసుకెళ్లిపోరుుంది. ఆనంద క్షణాలను మాయం చేసింది. మూడు కుటుంబాల వారిని దుఃఖసాగరంలో ముంచేసింది. గోపాలపురం శివారున పొగాకు బోర్డు సమీపంలో సోమవారం ఉదయం కారు ఎద్దును ఢీకొని పంటబోదెలోకి పల్టీలు కొట్టిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యూరు. చంటిబిడ్డ సహా మరో ఐదుగురు గాయూల పాలయ్యూరు.
ప్రమాదం జరిగిందిలా : దేవరపల్లి మండలం బందపురం గ్రామానికి చెందిన బాలం సత్యనారాయణ (48) కుటుంబం నాలుగు నెలల నుంచి దేవరపల్లిలో నివాసం ఉంటోంది. సత్యనారాయణ కుమార్తె అనూషను జంగారెడ్డిగూడెం మండలం శోభనాద్రిపురానికి చెందిన తిరుమలశెట్టి సత్యనారాయణకు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. అనూషకు ఆరు నెలల క్రితం తొలి కాన్పులో బాబు పుట్టాడు. ఆమెను అత్తిం టికి తీసుకెళ్లేందుకు చినమామ తిరుమలశెట్టి గంగరాజు సోమవారం సత్యనారాయణ ఇంటికి వచ్చాడు. మనుమడు మనీష్ మహికార్తీక్, కుమార్తె అనూషను చీరసారెలతో అత్తారింట్లో దిగబెట్టేందుకు తండ్రి సత్యనారాయణ, అతని వదిన
పాలి దేవమణి (45), ఆమె కుమార్తె శ్రీలక్ష్మీశ్వేత, అనూష చినమామ గంగరాజు, డ్రైవర్ బాలం నాగవెంకట సత్యనారాయణ కారులో బయలుదేరారు. గోపాలపురం శివారులో ముందువెళుతున్న ఎద్దును కారు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి వందమీటర్లు దూరం పల్టీలు కొడుతూ దూసుకువెళ్లి చెట్టును ఢీకొని పంటబోదెలోకి బోల్తా పడింది. ప్రమాదంలో అనూష తండ్రి సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా, అతని వదిన దేవమణికి తీవ్ర గాయాలయ్యూరుు. ఆమెను 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కాగా ఆరు నెలల బాబు మనీష్ మహికార్తీక్, మిగిలిన వారికి స్వల్ప గాయాల య్యాయి.
వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు చెట్టును ఢీకొన్నప్పుడు దేవమణి ఎగిరి చెట్టుపై పడిందని స్థానికులు తెలిపారు. ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలిస్తుండగా, ప్రాణాలు కోల్పోయింది. కారు నుంచి సత్యనారాయణను బయటకు తీసేప్పటికే మృతి చెందాడు. పసిబిడ్డ ప్రమాదం నుంచి మృత్యుం జయుడై బయటపడటంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. వారంతా ఇంటినుంచి బయలుదేరిన 15 నిమిషాల లోపే ప్రమాదం సంభవించింది. తండ్రి, పెద్దమ్మను కోల్పోడంతో అనూష, ఆమె కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఎస్సై డి.హరికృష్ణ కేసు నమోదు చేశారు.
బందపురంలో విషాద ఛాయలు
దేవరపల్లి : దేవరపల్లి-గోపాలపురం రోడ్డులో గోపాలపురం పొగాకు బోర్డు సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. దేవరపల్లి మండలం బందపురంకు చెందిన బాలం సత్యనారాయణ(48), కొయ్యలగూడెం మండలం అంకాలగూడెంకు చెందిన పాలి దేవమణి (45) మృతి చెందటంతో ఆ రెండు కుటుంబాల వారు విషాదంలో మునిగిపోయూరు. సత్యనారాయణకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు చిరంజీవి ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.