అనంతపురంలో డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ అయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో కేశవరెడ్డి, తన కూతురు అనూషతో ఉన్నారు. అదే సమయంలో అక్కడికి కారులో వచ్చిన దుండగులు అనూషను కారులోకి బలవంతంగా లాక్కుని పరారయ్యారు. ఈ హఠాత్తు పరిణామం నుంచి తేరుకుని అనుష తండ్రి కేశవరెడ్డి గట్టిగా కేకలు వేస్తూ కారును వెంబడించినా ఫలితం లేకపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.