
మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండకు చెందిన విద్యార్థిని రౌతు అనూష (23) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని శ్రీఇందు కళాశాలలో అనూష బీఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతుంది. ఆదివారం ఆమె సోదరుడితో కలిసి స్వగ్రామానికి వచ్చింది.
హాస్టల్‌లో తనను స్నేహితులు ఇబ్బంది పెడుతున్నారని కుటుంబ సభ్యులకు చెప్పగా.. తాము మాట్లాడుతామని ఆమెకు సర్దిచెప్పారు. హాస్టల్ నుంచి వచ్చిన మరుసటి రోజే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న వెల్దండ సీఐ సోమనర్సయ్య చారకొండకు చేరుకొని వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment