అనుష, కిషోర్ దంపతులు (ఫైల్)
వెంకటగిరి: ఓ వివాహిత అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన పట్టణంలోని బొప్పాపురం సాలెకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం బుడ్డగుంటపల్లికి చెందిన శ్రీరాములు, సావిత్రిల కుమార్తె అనుష (26)కు పట్టణంలోని బొప్పాపురం సాలెకాలనీకి చెందిన పసుపులేటి కిషోర్‌తో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి అనీష్, చక్రధర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వేసవి సెలవులకు పిల్లలు బుడగుంటపల్లికి వెళ్లారు.
దీంతో ఇంట్లో అనుష, కిషోర్‌లు మాత్రమే ఉంటున్నారు. సోమవారం ఉదయం తన భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కిషోర్ కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న అనుష కుటుం బసభ్యులు, బంధువులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిషోర్‌ను ఎస్సై కొండపనాయుడు విచా రించగా ఆదివారం రాత్రి తాను, అనుష ఒకేచోట నిద్రించా మని, తెల్లవారుజామున లేచి చూ సేసరికి ఆమె ఇం ట్లో ఉరివేసుకుని ఉందని చెప్పాడు. మృతదేహాన్ని పోలీసులు పరిశీలించగా వీ పు భాగంలో గాయాలు, గొంతు వద్ద గాట్లు ఉన్నా యి. దీంతో వారు కిషోర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా తమ కుమార్తె మృతిపై అనుమానం ఉందని ఆమె తండ్రి శ్రీరాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మర్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి కు మారులు విలపించడం స్థానికులను కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment