
అమ్మ, నాన్న తిట్టారని..
చందుర్తి: పాఠశాలకు వెళ్లమని మందలించినందుకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందుర్తి మండలం బండపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. చందుర్తి ఎస్సై శివకేశవులు కథనం ప్రకారం మండలంలోని బండపల్లి గ్రామానికి పల్లపు అనూష(14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతోంది. వారంరోజులుగా పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లి లక్ష్మి మందలించింది. అనంతరం వ్యవసాయ పనులకు వెళ్లిపోయింది.
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టింది. చుట్టు పక్కల వారు గుర్తించి కిందకు దించి వేములవాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. అనూష తండ్రి జీవనోపాధికోసం మస్కట్‌కు వెళ్లాడు. బాలిక తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.