నిశ్చితార్థం చేసుకుని ముఖం చాటేసి.. | Man Arrest in Love Cheating Case Hyderabad | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం చేసుకుని ముఖం చాటేసిన యువకుడి అరెస్ట్‌

Published Sat, Dec 22 2018 10:34 AM | Last Updated on Sat, Dec 22 2018 10:34 AM

Man Arrest in Love Cheating Case Hyderabad - Sakshi

అరుణ్‌ సింగ్‌

బంజారాహిల్స్‌: తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిశ్చితార్థం కూడా చేసుకొని ఇప్పుడు ముఖం చాటేశాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లోని నందినగర్‌కు చెందిన సీహెచ్‌. అనూష(21), సమీపంలోని ఓం సిమ్రాన్‌ అనే దుస్తుల షాపులో మేనేజర్‌గా పని చేస్తోంది. ఏడాదిన్నర క్రితం ఆమెకు ఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన అరుణ్‌ సింగ్‌(23) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇటీవల ఇద్దరూ నిశ్చితార్థం పేరుతో పెద్దలకు తెలియకుండా దండలు మార్చుకున్నారు. గత సెప్టెంబర్‌ 23న బాధితురాలి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకొని అదే నెల 25న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే సెప్టెంబర్‌ 24న అరుణ్‌ సింగ్‌ ఆమె ఇంటికి వచ్చి పెళ్లి  వాయిదా వేయాల్సిందిగా కోరాడు. అక్టోబర్‌ 20న మరోసారి ఆమె ఇంటికి వచ్చిన అరుణ్‌ తనకు రూ.10 వేలు కావాలని తీసుకెళ్లాడు. ఆ తర్వాత అరుణ్‌ మళ్లీ తిరిగి రాకపోగా ఆమెతో సంబంధాలు కూడా తెంచుకున్నాడు. ఆమె ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టాడు. పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్‌ పోలీసులు అరుణ్‌సింగ్‌పై కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement