
అనూష(ఫైల్)
అమీర్‌పేట: హాస్టల్‌లో ఉంటున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఇన్స్‌పెక్టర్ మురళీకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా, నరసారావుపేటకు చెందిన ఆకుల అనూష(23) బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ కోర్సు నేర్చుకునేందుకు మేనమామ శివప్రసాద్‌తో కలిసి నెల రోజుల క్రితం నగరానికి వచ్చింది. అమీర్‌పేటలోని విజయసాయి మహిళా హాస్టల్‌లో ఉంటుండగా, శివప్రసాద్ సమీపంలోని హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ కోర్సు నేర్చుకుంటున్నారు. మంగళవారం ఉదయం అనూష శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటాన్ని గుర్తించిన రూమ్మేట్స్ శివప్రసాద్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికు చేరుకున్న అతను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శివప్రసాద్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment