- రోడ్డు ప్రమాదంలో మరణించిన అనూష
- అవయవదానానికి అంగీకరించిన తల్లిదండ్రులు
అనూషా.. నీకు మరణం లేదు
Published Sun, Dec 25 2016 11:05 PM | Last Updated on Wed, Apr 3 2019 5:44 PM
అవయవదానం మనిషికి రెండో జీవితం. ఒక వ్యక్తి అవయవదానం ద్వారా ఎంతో మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు. ఈ అందమైన నినాదాలను నిజం చేశారు అనూష తల్లిదండ్రులు. అనూష మరణించినా ఆమె కళ్లు ఈ లోకాన్ని చూస్తాయి. ఆమె హృదయం స్పందిస్తుంది. ఆమె సమాజంలో జీవిస్తూనే ఉంటుంది.
– పాతపోస్టాఫీస్(విశాఖపట్నం)
విధి రాతను ఎవ్వరూ తప్పించుకోలేరన్నది నిజం. కొన్ని జీవితాల్లో అది వెలుగులు నింపితే.. మరికొన్ని జీవితాల్లో చీకట్లు కమ్మేలా చేస్తుంది. చిన్న ప్రాయంలోనే మృత్యు ఒడిని చేరి మరొకరి జీవితంలో వెలుగులు నింపిన రాజమండ్రి బొమ్మూరు గ్రామానికి చెందిన మేడిబోయిన అనూష కథ ఇది. ఆమె తండ్రి రాజమండ్రిలో కలాసీగా పనిచేస్తున్నాడు. తల్లి ఇంటి వద్దనే ఉంటూ ఇద్దరు పిల్లల ఆలనాపాలన చూస్తోంది. కూతురి మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు తమ దుఃఖాన్ని దిగమింగుకొని అవయవదానానికి సమ్మతించారు. ఆమె మరణించినా.. మరికొందరి రూపంలో ఈ లోకంలో బతికే ఉంటుంది.
ఈ నెల 22న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అనూష తీవ్ర గాయాలపాలైంది. తలకు తీవ్రగాయం కావడంతో... ప్రమాదం జరిగిన స్థలానికి సమీపంలో ఉన్న బరంపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో విశాఖ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. విశాఖలో తొలుత అపోలోకు తీసుకువెళ్లగా వివరాలు సక్రమంగా లేవంటూ వారు చేర్చుకోలేదు. దీంతో అదే రోజు రాత్రి 10 గంటలకు ఆమెను రాంనగర్ కేర్‌లో చేర్పించారు. ఆదివారం ఉదయం ఆమె బ్రెయి¯ŒS డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. వారి సూచన ప్రకారం ఆమె తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. నగరంలోని మొహిసి¯ŒS ఐ బ్యాంకుకు కళ్లను, సెవ¯ŒS హిల్స్‌కు ఒక కిడ్నీని, కేర్‌కు మరో కిడ్నీని, విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి లివర్‌ను అందజేయడానికి అంగీకరించారు.
ప్రమాదం వెనుక కథేంటి?
అనూష మృతిపై పలు పలు అనుమానాలున్నాయని ఆమె తల్లిదండ్రులు మేడిబోయిన కళావతి, శ్రీను ఆరోపిస్తున్నారు. వారు చెప్పిన వివరాల మేరకు...శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమేదారుపుట్టుగకు చెందిన కె. యోగేశ్వరరావు అదే మండలం కొత్త కొజ్జిరియా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల కిందట రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్నాడు. ఆ సమయంలో బొమ్మూరులో గది అద్దెకు తీసుకొని అక్కడ విద్యార్థులకు ట్యూష¯ŒS చెప్పేవాడు. ట్యూష¯ŒS కోసం అతని వద్దకు అనూష వెళ్లేది. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. శిక్షణ పూర్తి చేసుకుని యోగేశ్వరరావు తన స్వగ్రామానికి వెళ్లిపోయినా వారిమధ్య ప్రేమ మాత్రం తరగలేదు. తరచూ ఫోన్లలో సంభాషించుకునేవారు. అతను అప్పుడప్పుడు బొమ్మూరు వచ్చి ఆమెను కలుసుకునేవాడు. ఈ నెల 10వ తేదీన అనూష అతనికి ఫో¯ŒS చేయగా ఒక మహిళ ఫో¯ŒS లిఫ్ట్‌చేసి తను యోగేశ్వరరావు భార్యనని, తన భర్తకు ఫో¯ŒS చేయవద్దని హెచ్చరించింది. ఆ మాటలకు అనూష హతాశురాలైంది. విషయం తెలుసుకునేందుకు ఈ నెల 22న తనకు అన్న వరసైన వ్యక్తితో కొత్త కొజ్జిరియా వెళ్లి.. నేరుగా అతన్ని కలుసుకుంది. ఫో¯ŒSలో జరిగిన సంభాషణ చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో రెండు నెలల క్రితం భర్త చనిపోయి ఇద్దరు పిల్లలున్న మహిళను వివాహం చేసుకున్నానని యోగీశ్వరరావు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఐదు నిముషాల్లో తీసుకువస్తానని ఆమెతో వచ్చిన వ్యక్తికి చెప్పి, అనూషను ద్విచక్రవాహనం ఎక్కించుకొని ఇచ్ఛాపురం తీసుకెళ్లాడు. అక్కడ జరిగిన ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను బరంపురం, అక్కడి నుంచి విశాఖలో అపోలోకు తీసుకొచ్చి, చివరకు కేర్‌లో జాయి¯ŒS చేశాడు. ఆమె తల్లిదండ్రులకు జరిగిందని చెప్పి ఆస్పత్రికి రప్పించాడు. బిల్లు చెల్లించేందుకు డబ్బులు తీసుకువస్తానని చెప్పి 23న యోగేశ్వరరావు పరారయ్యాడు. ఈ విషయం గ్రహించిన ఆమె తల్లిదండ్రులు ఇచ్ఛాపురం పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఫిర్యాదు చేశారు. యోగేశ్వరరావు తమ అమ్మాయిని ప్రేమించి మోసగించాడని, జరిగిన ప్రమాదంపై పలు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Advertisement
Advertisement