
ప్రేమ లేదని..ప్రియుడు రాడని!
ఆత్మహత్య చేసుకున్న యువతి
వలేటివారిపాలెం: ప్రేమించినవాడు దక్కడన్న అనుమానంతో యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని శింగమనేని పల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. కసుకుర్తి అనూషా(18) అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమలో ఉన్నారు. అయితే కొంతకాలంగా అతను అనూషాతో సరిగా ఉండక పోవడంతో మనస్తాపానికి గురైంది. తనను వివాహం చేసుకోడనే అనుమానంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న కందుకూరు డీఎస్పీ ప్రకాశరావు మృతదేహాన్ని పరిశీలించి వివరాల సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కందుకూరు రూరల్ ఎస్సై ప్రభాకర్ తెలిపారు.