‘జంబలకిడి పంబ’లా... | 'jambalakidi pamba la' movie audio released | Sakshi
Sakshi News home page

‘జంబలకిడి పంబ’లా...

Published Fri, Jan 3 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

‘జంబలకిడి పంబ’లా...

‘జంబలకిడి పంబ’లా...

ఇరవై ఏళ్ల క్రితం ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన ‘జంబలకిడి పంబ’ సినిమా ప్రేక్షకులను ఎంతలా నవ్వించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

 ఇరవై ఏళ్ల క్రితం ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన ‘జంబలకిడి పంబ’ సినిమా ప్రేక్షకులను ఎంతలా నవ్వించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆ టైటిల్‌ని గుర్తుచేసే విధంగా ఇప్పుడు ‘పంబలకిడి జంబ’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. అశోక్, దివ్య, అనూష ప్రధాన పాత్రధారులు. శివరాం గొర్రెపాటి దర్శకుడు. యు.ఎన్.రాజ్ నిర్మాత. జయవర్ధన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర ఆడియోసీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని సీనియర్ హీరో నరేష్‌కి అందించారు.
 
 కొత్త దర్శకుల సినిమాలు ఇటీవల ఘన విజయాలను అందుకున్నాయని, వాటి వరుసలోనే ఈ సినిమా కూడా విజయం సాధించాలని, తన ‘జంబలకిడి పంబ’లా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని నరేష్ ఆకాంక్షించారు. ప్రధాన పాత్రధారులు కొత్తవారైనా చక్కగా నటించారని దర్శకుడు చెప్పారు. దర్శకుడు ‘నల్లపూసలు’ బాబ్జీ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించడం విశేషమని, పోస్ట్ ప్రొడక్షన్ ముగించి ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. కె.వి.వి.సత్యనారాయణ, మోహన్‌గౌడ్, తోట కృష్ణ, కె.ఎస్.నాగేశ్వరరావు, ఎ.ఎస్.రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement