
ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న అనూష
చిట్యాల: బ్లడ్ క్యాన్సర్‌తో ఓ వెటర్నరీ విద్యార్థిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి నాగుల రాజమణి, రమేష్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె అనూష(23) హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో ఫైనలియర్ చదువుతోంది. ఉన్నట్టుండి అనూష గత నెల రోజుల కింద అనారోగ్యానికి గురైంది. హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్ష చేయించగా బ్లెడ్ క్యాన్సర్ ఉందని నిర్ధారించారు.
దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రూ. 40 లక్షలు ఉంటే ఆపరేషన్ చేసి బ్రతికిస్తామని వైద్యులు చెప్పినట్లు తల్లిదండ్రులు రాజమణి, రమేష్ తెలిపారు. మానవతావాదులు, దాతలు స్పందించి అనూషను బతికించాలని వారు వేడుకుంటున్నారు. చిట్యాల ఆంధ్రాబ్యాంకులో తన అకౌంట్ నంబర్ 0096100250250197కు తమ ఆర్థిక సాయం పంపించాలని రమేష్ ప్రాధేయపడుతున్నాడు.