Veterinary students
-
పశువైద్యులకు ‘కాంట్రాక్టు’ గండం
సాక్షి, హైదరాబాద్: పశువైద్య విద్యను అభ్యసించిన ఉద్యోగార్థులకు టీఎస్పీఎస్సీ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ నిరాశ మిగిల్చింది. రాష్ట్రంలోని రెండు మల్టీజోన్లవారీగా ఈ నెల 22న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం తమకు అన్యాయం జరుగుతోందని పశువైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద తీసుకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 247 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కానీ తాజా నోటిఫికేషన్లో కేవలం 170 క్లాస్–ఏ వీఏఎస్ పోస్టులనే భర్తీ చేస్తున్నారని వాపోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 850 మంది వెటర్నరీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారని, 2016 తర్వాత విడుదలైన నోటిఫికేషన్లో తగినన్ని పోస్టులు లేకపోవడం, కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారి స్థానంలో పోస్టులు చూపకపోవడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా మల్టీజోన్–1లో 90 పోస్టులు, మల్టీజోన్–2లో 80 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా కాంట్రాక్టు ఉద్యోగులున్నారని చూపని 77 ఖాళీల్లో ఎక్కువగా మల్టీజోన్–2లోనే ఉన్నాయని పశువైద్య ఉద్యోగార్థులు చెబుతున్నారు. మల్టీజోన్–2లో నోటిఫై చేసిన పోస్టులను పరిశీలిస్తే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండే బీసీ వర్గాలకు కేవలం 3 సాధారణ ఖాళీలు చూపారని, బీసీ–బీ, సీ, డీ, ఈ గ్రూపుల అభ్యర్థులకు అసలు పోస్టులే లేకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ–బీ, సీ గ్రూపుల్లో మహిళా కోటాలో ఒక్కో పోస్టునే నోటిఫై చేయడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందంటున్నారు. అందువల్ల టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్‌ను వెంటనే సవరించి మొత్తం 247 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా నోటిఫికేషన్లో మొత్తం 170 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) పోస్టులకుగాను 89 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులే ఉన్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీలకు చెందిన పోస్టులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు వెటర్నరీ సైన్స్ చదివిన అర్హులైన వారందరికీ ఉద్యోగాలు వచ్చాయని, తెలంగాణ ఏర్పాటయ్యాక జిల్లాలు, మండలాలు పెరిగినప్పటికీ ఒక్క కొత్త పోస్టును కూడా సృష్టించకపోగా ఖాళీగా ఉన్న వాటిలో కోత పెట్టి నోటిఫికేషన్లు ఇవ్వడంతో అన్యాయం జరుగుతోందనేది పశువైద్య విద్యార్థుల అభిప్రాయం. -
వెటర్నరీ విద్యార్థుల ఆందోళనలో ఉద్రిక్తత
విజయనగర్‌కాలనీ: తమ ఉద్యోగాలను తమకు కాకుండా చేస్తున్నారంటూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఎదుట వెటర్నరీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆందోళనలో ఓ విద్యార్థి ఆకస్మాత్తుగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలను కనీస అర్హత లేని అటెండర్లతో భర్తీ చేస్తున్నట్లు తెలుసుకున్న వెటర్నరీ డిప్లొమా చేసిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత ఉన్న కోర్సులు చదివిన తమకు అవకాశం కల్పించాలని సోమవారం మసాబ్‌ట్యాంకులోని పశుసంవర్ధక శాఖ కార్యా లయం వద్ద ధర్నాకు దిగారు. ఆందోళన పట్ల అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనకారులు కార్యాలయం భవనంపైకి వెళ్లి ఆందోళన నిర్వహించారు. ఇంతలో ఓ విద్యార్థి పెట్రోల్ ఒంటిపై పోసు కుని ఆత్మహత్యకు యత్నించడంతో తోటి విద్యార్థులు అడ్డుకుని అతడిపై నీళ్లు చల్లారు. ఈ ఘటనతో తక్షణమే స్పందించిన పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో ఫోనులో మాట్లాడి సమస్యను వివరించారు. అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 300 మంది వెటర్నరీ డిప్లొమా విద్యార్థులకు కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్లు విద్యార్థులకు డైరెక్టర్ తెలిపారు. అలాగే మరిన్ని సమస్యల పరిష్కారానికి వచ్చే నెల 3న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. -
రోడ్డు ప్రమాదంలో వెటర్నరీ విద్యార్థి మృతి
సాక్షి, యూనివర్సిటీక్యాంపస్: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో జరుగుతున్న సదస్సుకు హాజ రైన ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాలకు చెందిన విద్యార్థి గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కర్నూలు జిల్లాకు చెందిన సునీల్ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాలలో బీవీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇతని తండ్రి టైలర్‌గా పనిచేస్తున్నాడు. తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరి యంలో గురువారం ప్రారంభమైన నానోటెక్నాలజీ సదస్సుకు హాజరయ్యేందుకు సునీల్ తిరుపతికి వచ్చారు. భోజన విరామ సమయంలో ఎస్వీ వ్యవసాయ కళాశాలలోని తన మిత్రుడ్ని కలసి అతని బైక్ తీసుకుని తిరిగి వస్తున్నాడు. వెటర్నరీ యూనివర్సిటీలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథా లయం వద్ద స్పీడ్ బ్రేకర్‌ను గుర్తించలేదు. వేగంగా వెళుతుండడంతో అదుపు తప్పి పడిపోయాడు. స్నేహితులు తిరుపతిలోని రుయాసుపత్రికి తరలిం చారు. చికిత్స పొం దుతూ మరణిం చాడు. సునీల్ గత ఏడాది వెటర్నరీ యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయ స్థాయి అగ్రిఫెస్టోలో గ్రూప్‌డ్యాన్స్ విభా గంలో రెండవ బహుమతి పొందారు. ప్రొద్దుటూ రు వెటర్నరీ కళాశాలపై చక్కటి వీడియో రూపొం దించారు. అయితే చదువు, కళారంగంలో చురు కైన ఈ విద్యార్థి దురదృష్టవశాత్తు తన ప్రాణాలు కోల్పోయారని వెటర్నరీ వర్సిటీ స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ కె.సర్జన్‌రావు తెలిపారు. డీఎస్ఏ సహకారం వెటర్నరీ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న విషయం తెలుసుకున్న వెంటనే వర్సిటీ స్టూడెంట్ అఫైర్స్ డీన్ కె.సర్జన్ రావు తక్షణం స్పందించి సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య సేవలు అందించినా లాభం లేకపోయింది. -
అనూషను బతికించండి
చిట్యాల: బ్లడ్ క్యాన్సర్‌తో ఓ వెటర్నరీ విద్యార్థిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి నాగుల రాజమణి, రమేష్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె అనూష(23) హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో ఫైనలియర్ చదువుతోంది. ఉన్నట్టుండి అనూష గత నెల రోజుల కింద అనారోగ్యానికి గురైంది. హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్ష చేయించగా బ్లెడ్ క్యాన్సర్ ఉందని నిర్ధారించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రూ. 40 లక్షలు ఉంటే ఆపరేషన్ చేసి బ్రతికిస్తామని వైద్యులు చెప్పినట్లు తల్లిదండ్రులు రాజమణి, రమేష్ తెలిపారు. మానవతావాదులు, దాతలు స్పందించి అనూషను బతికించాలని వారు వేడుకుంటున్నారు. చిట్యాల ఆంధ్రాబ్యాంకులో తన అకౌంట్ నంబర్ 0096100250250197కు తమ ఆర్థిక సాయం పంపించాలని రమేష్ ప్రాధేయపడుతున్నాడు. -
వెటర్నరీ విద్యార్థుల దీక్షకు జగన్ మద్దతు
సాక్షి, కృష్ణా: రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్లను వెటర్నరీ డిస్పెన్సరీలుగా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ గన్నవరంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వెటర్నరీ విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఆయన గురువారం విద్యార్థుల సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ఎన్ని వినతులు చేసిన ప్రభుత్వం తమ సమస్యలను తీర్చడం లేదంటూ విద్యార్థులు ఈ సందర్భంగా వైఎస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ఆయనకు వినతి పత్రం అందజేశారు. 2016లో వైఎస్ జగన్ మద్దతు తెలపడంతోనే ప్రభుత్వం దిగివచ్చి 250 మందికి ఆర్ఎల్యూలకు వీడీగా పదోన్నతి ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 1217 ఉద్యోగాల్లో సగం వెంటనే భర్తీ చేస్తామని, మిగతావాటిని ఒక సంవత్సరంలో భర్తీ చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కాగా రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ (ఆర్‌ఎల్‌యూ)లను వెటర్నరీ డిస్పెన్సరీలుగా (వీడీ) అప్‌గ్రేడ్ చేయాలని గత 22రోజులుగా విద్యార్థులు రిలే దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. -
హైదరాబాద్‌లో వెటర్నరీ విద్యార్థుల ఆందోళన
-
ఏపీపీఎస్సీ నుంచి మినహాయించాలి
గన్నవరం : ఏపీపీఎస్సీ నుంచి పశువైద్యుల నియామకాలను మినహాయించాలని కోరుతూ స్థానిక ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల చేపట్టిన ఆందోళనను ఉధృతం చేశారు. ఆందోళన శుక్రవారానికి 16వ రోజుకు చేరింది. సమ్మెలో స్థానిక కళాశాల విద్యార్థులతో పాటు తిరుపతి, ప్రొద్దుటూరు నుంచి వచ్చిన 60 మంది పశువైద్య విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రధాన ద్వారానికి తాళాలు వేసి బైఠాయించి, ప్రభుత్వ విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థి నాయకులు ఎం.భాస్కర్, డి.ఏడుకొండలు, రామ్మోహన్, ఎం.ప్రవీణ్‌రాజు మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా డిపార్ట్మెంట్ సెలక్షన్ల ద్వారా జరుగుతున్న పశువైద్యుల నియామకాలను ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలనుకోవడం దారుణమన్నారు. దీనివల్ల డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే ఉద్యోగాలు వస్తాయని, ప్రతిభవంతులైన విద్యార్థులకు ∙అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు వారాలకుపైగా తరగతులు, బోర్డు పరీక్షలను బహిష్కరించి ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధకరమన్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి పాతపద్ధతిలోనే కొత్తగా మంజూరైన 300 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు కె.రమ్య, స్వాతి పాల్గొన్నారు. -
వెటర్నరీ విద్యార్థులకు వైఎస్ జగన్ మద్దతు
విజయవాడ: పశు వైద్య కేంద్రాలను పశువైద్యశాలలుగా మార్చాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. శుక్రవారం గుంటూరు జిల్లా పర్యటనలో వెళుతున్న ఆయన వెటర్నరీ కళాశాల వద్ద విద్యార్థుల దీక్ష శిబిరాన్ని సందర్శించారు. జీవో నెంబర్ 97లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ పశువైద్య విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం సంచార పశువైద్యం కోసం ప్రైవేటు నియామకాలు జరుపుతామని ప్రకటిస్తూ జీవో నెంబరు 97 విడుదల చేయటాన్ని వ్యతిరేకిస్తూ వారు దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రన్న సంచార పశు వైధ్యపథకంలో కాంట్రాక్ట్ పద్ధతుల్లో కాకుండా శాశ్వత పద్ధతుల్లో పశువైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చేస్తున్న డిమాండ్లు న్యాయబద్ధమైనవన్నారు. ఆర్ఎల్యూలను వీడీలుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. సంచార పశు వైద్యశాలల్లో కాంట్రాక్టు నియామకాల్ని వ్యతిరేకిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. జీవో నెంబరు 97 రద్దు చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తామన్నారు. మున్సిపాలిటీల్లో జంతువుల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టేందుకు పశువైద్యులు క్రియాశీలక పాత్ర పోసిస్తారన్నారు. ఇన్ని రోజులుగా దీక్ష చేస్తున్నా విద్యార్థుల ఆందోళనపై చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు హయాంలో న్యాయం జరగకుంటే వచ్చేది వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమేనని, తప్పక న్యాయం చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అప్పటివరకూ విద్యార్థులకు పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.