
సాక్షి, యూనివర్సిటీక్యాంపస్: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో జరుగుతున్న సదస్సుకు హాజ రైన ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాలకు చెందిన విద్యార్థి గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కర్నూలు జిల్లాకు చెందిన సునీల్ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాలలో బీవీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇతని తండ్రి టైలర్‌గా పనిచేస్తున్నాడు. తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరి యంలో గురువారం ప్రారంభమైన నానోటెక్నాలజీ సదస్సుకు హాజరయ్యేందుకు సునీల్ తిరుపతికి వచ్చారు. భోజన విరామ సమయంలో ఎస్వీ వ్యవసాయ కళాశాలలోని తన మిత్రుడ్ని కలసి అతని బైక్ తీసుకుని తిరిగి వస్తున్నాడు.
వెటర్నరీ యూనివర్సిటీలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథా లయం వద్ద స్పీడ్ బ్రేకర్‌ను గుర్తించలేదు. వేగంగా వెళుతుండడంతో అదుపు తప్పి పడిపోయాడు. స్నేహితులు తిరుపతిలోని రుయాసుపత్రికి తరలిం చారు. చికిత్స పొం దుతూ మరణిం చాడు. సునీల్ గత ఏడాది వెటర్నరీ యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయ స్థాయి అగ్రిఫెస్టోలో గ్రూప్‌డ్యాన్స్ విభా గంలో రెండవ బహుమతి పొందారు. ప్రొద్దుటూ రు వెటర్నరీ కళాశాలపై చక్కటి వీడియో రూపొం దించారు. అయితే చదువు, కళారంగంలో చురు కైన ఈ విద్యార్థి దురదృష్టవశాత్తు తన ప్రాణాలు కోల్పోయారని వెటర్నరీ వర్సిటీ స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ కె.సర్జన్‌రావు తెలిపారు.
డీఎస్‌ఏ సహకారం
వెటర్నరీ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న విషయం తెలుసుకున్న వెంటనే వర్సిటీ స్టూడెంట్ అఫైర్స్ డీన్ కె.సర్జన్ రావు తక్షణం స్పందించి సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య సేవలు అందించినా లాభం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment