
సాక్షి, అనంతపురం: అనంతపురంలో డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ అయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో కేశవరెడ్డి, తన కూతురు అనూషతో ఉన్నారు. అదే సమయంలో అక్కడికి కారులో వచ్చిన దుండగులు అనూషను కారులోకి బలవంతంగా లాక్కుని పరారయ్యారు. ఈ హఠాత్తు పరిణామం నుంచి తేరుకుని అనుష తండ్రి కేశవరెడ్డి గట్టిగా కేకలు వేస్తూ కారును వెంబడించినా ఫలితం లేకపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.
అనూష క్షేమం...
కిడ్నాప్‌కు గురైన యువతి ఉదంతం కొద్ది గంటల్లోనే సుఖాంతమైంది. యువతి అనూష క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ముగ్గురు కిడ‍్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment