Rashmika Mandanna replaced Sreeleela in 'Chalo' movie - Sakshi
Sakshi News home page

Sreeleela-Rashmika: శ్రీలీల గురించి సీక్రెట్ చెప్పిన నాగశౌర్య

Published Sat, Jul 1 2023 5:00 PM | Last Updated on Sat, Jul 1 2023 5:58 PM

Chalo Movie Heroine First Choice Sreeleela - Sakshi

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు శ్రీలీల. ఒకటి, రెండు కాదు ఏకంగా 8 సినిమాలు ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. మరో 2-3 చిత్రాలు అనౌన్స్‌మెంట్‌కి సిద్ధంగా ఉన్నాయి. నేషనల్ క్రష్ రష్మిక కూడా పలు సినిమాలు చేస్తున్నప్పటికీ ఈమెపై దర్శకనిర్మాతలు ఎందుకో అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఇలాంటి సమయంలో ఈ భామలు ఇద్దరి గురించి హీరో నాగశౌర్య ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. 

(ఇదీ చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!)

శ్రీలీల బదులు రష్మిక
'మేం మొదట 'ఛలో' సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలనే అనుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా చివరివరకు శ్రీలీలనే హీరోయిన్. కానీ చివరి నిమిషంలో కొన్ని కారణాలతో శ్రీలీల స్థానంలో రష్మికని తీసుకోవాల్సి వచ్చింది' అని నాగశౌర్య చెప్పాడు. ఈ విషయం శ్రీలీల అభిమానుల్ని డిసప్పాయింట్ చేయగా, రష్మిక ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది. 

ఒకవేళ చేసుంటే?
హీరో నాగశౌర్య చెప్పినట్లు శ్రీలీల.. 'ఛలో' సినిమాలో హీరోయిన్ గా చేసుంటే ఇప్పుడు దక్కుతున్న క్రేజ్ 2018లోనే వచ్చేది. ఈ పాటికే తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ నటించేసి, పాన్ ఇండియా స్టార్ అయిపోయిండేది. ఒకవేళ ఇలా జరుగుంటే రష్మిక మందన్న తెలుగు ఎంట్రీకి మరికాస్త సమయం పట్టుండేది. ఏదైతేనేం ప్రస్తుతం ఇద్దరు బ్యూటీస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

(ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement