Rangabali Success Meet: Naga Shaurya Says Sorry To Media Over Comedian Satya Spoof Interview - Sakshi
Sakshi News home page

Naga Shaurya Apologises To Media: ఎవరినీ హర్ట్‌ చేయాలనుకోలేదు, మా వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించండి..

Published Sat, Jul 8 2023 5:25 PM | Last Updated on Sat, Jul 8 2023 5:52 PM

Rangabali Success Meet: Naga Shaurya Says Sorry To Media Over Comedian Satya Spoof Interview - Sakshi

హీరో నాగశౌర్య, హీరోయిన్‌ యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం రంగబలి. పవన్‌ బాసంశెట్టి డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా జూలై 7న విడుదలైంది. సినిమా రిలీజవడానికి ముందు చిత్రయూనిట్‌ వేరే లెవల్‌లో ప్రమోషన్స్‌ చేశారు. టాలీవుడ్‌లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే పలువురు ప్రముఖులను అనుకరిస్తూ స్పూఫ్‌ చేశారు. కమెడియన్‌ సత్య చేసిన ఈ స్పూఫ్‌ వీడియోకు విశేష స్పందన వచ్చింది. కానీ కొందరు మాత్రం హర్టయినట్లు తెలుస్తోంది.

తాజాగా ఇదే విషయాన్ని ఓ జర్నలిస్టు హీరో నాగశౌర్య దృష్టికి తీసుకెళ్లాడు. మీడియా మీద సెటైర్‌ వేయాలన్న ఆలోచన ఎవరిది? అని అడిగాడు. దీనికి నాగశౌర్య స్పందిస్తూ.. 'మీడియా, మేము ఒకటే ఫ్యామిలీ. మేమైతే అలాగే అనుకుంటున్నాం. అదే మీడియా వాళ్లు చంద్రబాబు, కేసీఆర్‌లను డూప్‌లు పెట్టి వీడియోలు చేస్తారు. మేము సినిమా తీసి దాన్ని ప్రమోట్‌ చేయడానికి ఎవరినీ హర్ట్‌ చేయకుండా మీ అందరికీ తెలిసిన వ్యక్తులను సెలక్ట్‌ చేసుకున్నాం.

ఒక హీరోను వాళ్లు తమదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందని సరదాగా చూపించాం. అంతేతప్ప ఎవరినీ ఎగతాళి చేయలేదు. ఇది ముందుగా అనుకుని కూడా చేయలేదు. ఒకవేళ దీనివల్ల ఎవరైనా హర్ట్‌ అయితే నన్ను క్షమించండి. ఎవరి మీదైతే స్పూఫ్‌ చేశామో వాళ్లేమైనా హర్ట్‌ అయ్యారేమో అని అడిగి తెలుసుకున్నాం. చాలామంది ఎంజాయ్‌ చేశామన్నారు. కానీ ఒకరిద్దరు హర్ట్‌ అయ్యారంటూ వేరే ఎవరో ప్రచారం చేయడం వల్లే అది ఫేమస్‌ అయింది తప్ప ఎవర్నీ హర్ట్‌ చేయలేదు, ఎవరూ హర్ట్‌ అవలేదు' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: నటనే రాదు కానీ స్టార్‌ హీరో... ప్రభాస్‌పై అనుచిత వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement