'నా మాతృ భాష హిందీ. ‘రంగబలి’ కోసం తెలుగులో పెద్ద పేరా గ్రాఫ్ డైలాగులు నేర్చుకొని చెప్పడం సవాల్‌గా అనిపించింది. ఈ విషయంలో డైరెక్షన్ టీమ్‌కి థ్యాంక్స్. అలాగే దర్శకుడు పవన్‌గారు స్క్రిప్ట్‌ని ముందే నాకు ఇవ్వడంతో కొంచెం సులభం అయింది' అని హీరోయిన్ యుక్తి తరేజ అన్నారు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ యుక్తి తరేజ మాట్లాడుతూ–'మాది హరియాణ. ఢిల్లీ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తర్వాత మోడలింగ్ మొదలుపెట్టాను. అనంతరం యాక్టింగ్ ఆడిషన్స్ ఇచ్చాను. ‘లుట్ గయ్..’ అనే పాట మంచి పేరు తీసుకొచ్చింది. పవన్‌గారు ఆడిషన్ చేసి ‘రంగబలి’ కి ఎంపిక చేశారు. ఇందులో మెడికల్ స్టూడెంట్ సహజగా కనిపిస్తా. నా మొదటి సినిమాకే నాగశౌర్యగారితో పాటు మంచి నిర్మాణ సంస్థలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగులో నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది. హీరోయిన్స్‌లో అనుష్క శెట్టిగారు అంటే ఇష్టం. ప్రస్తుతం తెలుగులో కొన్ని కథలు వింటున్నాను' అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment