సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్‌హీరో నాగశౌర్య సరసన టాప్ పాప్ సింగర్ తెలుగులో అడుగుపెడుతోంది. నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కనున్న మూవీలో యూట్యూబర్, నటి షిర్లీ సెటియా (25) ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయాన్ని షిర్లే స్వయంగా ట్విటర్‌లో ధృవీకరించింది. అటు ఇంకా టైటిల్ కాని ఫిక్స్ కాని ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా నటిస్తున్నట్టు ఆమె అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా వస్తోన్న ఈ చిత్రాన్ని నాగశౌర్య తల్లిదండ్రులు ఉషా, శంకర్ ములుపూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవర్, అలా ఎలా ఫేం అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.కాగా ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో "మాస్కా" చిత్రంతో యాక్టింగ్ కరియర్ ఆరంభించిన సెటియా పాప్ సింగర్‌గా రాణించారు..
I am super excited to announce my launch in Telugu film Industry with @IamNagashaurya, directed by #AneeshKrishna and produced by #Ushamulpuri Garu under banner @ira_creations .
— Shirley Setia (@ShirleySetia) November 21, 2020
A @mahathi_sagar 🎹,
🎥#SaiSriram #IRA4 #NS22 🌈🌸🙌🏻💫 pic.twitter.com/vrWWphtFjh
Comments
Please login to add a commentAdd a comment