Naga Shaurya Gives Clarity On Hyderabad Road Issue After Boyfriend Slaps His Girlfriend - Sakshi
Sakshi News home page

Naga Shaurya Road Fight Controversy: రోడ్డుపై గొడవ.. అసలు విషయం చెప్పిన హీరో!

Published Wed, Jun 28 2023 7:41 AM | Last Updated on Wed, Jun 28 2023 10:37 AM

 Naga Shaurya Clarify On Hyd Road Side Issue - Sakshi

సాధారణంగా సెలబ్రిటీలు బయట కనిపించరు. ఒకవేళ కనిపించినా సరే ఎవరితోనూ మాట్లాడకుండా, వచ్చిన పని చూసుకుని వెళ్లిపోతారు. హీరో నాగశౌర్య మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ లోని రోడ్డుపై ఓ అమ్మాయి-అబ్బాయి గొడవ పడుతుంటే మధ్యలోకి దూరాడు. వాళ్లకు ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అదేమంత పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఎందుకులేరా బాబు అని వచ్చిన దారిలోనే వెళ్లిపోయాడు. ఇప్పుడు సందర్భం రావడంతో అసలు ఆ రోజు ఏం జరిగిందనేది బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో?)

ఏంటి గొడవ?
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇది. హైదరాబాద్ రోడ్డుపై ఓ అబ్బాయి-అమ్మాయి గొడవ పడుతున్నారు. అటుగా కారులో వెళ్తున్న హీరో నాగశౌర్య.. ఈ గొడవ చూసి ఆగిపోయాడు. వాళ్లిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ పెద్దగా ఫలించలేదు. ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇది మూవీ ప్రమోషన్ కోసమని కొందరు అంటే.. ఏం జరిగిందా అని మరికొందరు ఆసక్తి చూపించారు. తాజాగా నాగశౌర్య హీరోగా నటించిన 'రంగబలి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో ఇదే ప్రశ్న అడగ్గా... ఆరోజు అసలేం జరిగిందనేది నాగశౌర్య బయటపెట్టేశాడు. 

జరిగింది ఇదే!
'నేను పనిమీద కూకట్‌పల్లి నుంచి వెళ్తున్నాను. ఆ సమయంలో ఓ అబ్బాయి తన లవర్ ని కొట్టడం చూశాను. వెంటనే కారు ఆపి అతడి దగ్గరికి వెళ్లి ఎందుకు కొడుతున్నావ్, ఆమెకు సారీ చెప్పమని అడిగాను. అతడి రియాక్ట్ అయ్యేలోపు ఆ అమ్మాయి మాట్లాడింది. 'నా భాయ్ ఫ్రెండ్ నన్ను కొడతాడు, చంపుతాడు నీకేంటి?' అని నాకు కౌంటర్ వేసింది. ఆ అమ్మాయి అలా అడిగితే మనం మాత్రం ఏం చేస్తాం. ఆ రోజు జరిగిన సంఘటనలో అబ్బాయిది కాదు అమ్మాయిదే తప్పు. ఇంకో రూమర్ ఏంటంటే.. ప్రచారం కోసం ఆ గొడవని నేనే ప్లాన్ చేశానన‍్నారు. కానీ వాళ్లెవరో కూడా నాకు తెలియదు' అని నాగశౌర్య చెప్పుకొచ‍్చాడు.

(ఇదీ చదవండి: ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement