'కళ్యాణ వైభోగమే' ట్రాక్ ఎక్కిస్తుందా..? | Naga shaurya, Nadhini reddy Combo kalyana Vaibhogame | Sakshi
Sakshi News home page

'కళ్యాణ వైభోగమే' ట్రాక్ ఎక్కిస్తుందా..?

Published Sat, Jan 16 2016 12:01 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

'కళ్యాణ వైభోగమే' ట్రాక్ ఎక్కిస్తుందా..?

'కళ్యాణ వైభోగమే' ట్రాక్ ఎక్కిస్తుందా..?

ఇండస్ట్రీలో సక్సెస్ సాధించటమే కాదు ఆ సక్సెస్ను కొనసాగించటం కూడా చాలా ముఖ్యంగా. తొలి సినిమాతోనే సంచలనాలు నమోదు చేసిన చాలా మంది ఆ సక్సెస్ను కొనసాగించలేక వెనకపడిపోతున్నారు. తొలి సినిమాతో ఆకట్టుకున్న నందినీ రెడ్డి, నాగశౌర్యలు, ఆ తరువాత ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయారు. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన నందినీ రెడ్డి, తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తరువాత సిద్ధార్ద్ హీరో తెరకెక్కించిన జబర్థస్త్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచింది నందిని. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని కళ్యాణ వైభోగమే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య, ఆ తరువాత ఆ సక్సెస్ను కొనసాగించలేకపోయాడు. మాస్ టర్న్ తీసుకొని చేసిన జాదుగాడు కూడా వర్క్ అవుట్ కాకపోవటంతో, తనకు హిట్ ఇచ్చిన రొమాంటిక్ జానర్నే మరోసారి నమ్ముకున్నాడు.

నందినీ రెడ్డి, నాగశౌర్యలు కలిసి కళ్యాణ వైభోగమే సినిమా కోసం పనిచేశారు. ఇద్దరి కెరీర్కు ఈ సినిమా సక్సెస్ కీలకం కావటంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం ఫేం మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఈ నెల మూడో వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement