జాదూ... | 'Jadoogadu' trailer released, Naga Shaurya plays a mass role | Sakshi
Sakshi News home page

జాదూ...

Published Mon, May 11 2015 10:58 PM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

జాదూ...

జాదూ...

లోన్ రికవరీలో అతను కింగ్. ఎలాంటి వాళ్లనైనా ముప్పుతిప్పలు పెట్టి బాకీ వసూలు చేయగల సమర్థుడు. అలాంటి జాదూగాడినే ఓ ఆటాడిస్తుందో అమ్మాయి. ఆ కథ ఏంటో తెలియాలంటే ‘జాదూగాడు’ చూడాల్సిందే. నాగశౌర్య, సోనారిక జంటగా ‘చింత కాయల రవి’ ఫేం యోగేశ్ దర్శకత్వంలో వి.వి.ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘జాదూగాడు’. ఈ నెలలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘నాగశౌర్య చేసిన గత చిత్రాలకు భిన్నంగా ఇది ఉంటుంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని చెప్పారు. సాగర్ మహతి స్వరాలందించిన పాటలకు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి  కెమెరా: సాగర్ మహతి, కథ మాటలు: మధుసూదన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement