Jadoogadu
-
ఇదే తొలిసారి!
‘‘ఈ చిత్రంలో నాది మాస్ కేరక్టర్. ఈ తరహా పాత్ర చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చాలా మంది ‘అప్పుడే మాస్ పాత్ర అవసరమా’ అని అడిగారు. కానీ, ఈ సినిమా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాలో నటించాను’’ అని హీరో నాగశౌర్య అన్నారు. యోగేశ్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వీవీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం -‘జాదూగాడు’. శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రవిశేషాలను నాగశౌర్య పంచుకున్నారు. ‘‘ఇందులో బ్యాంక్ రికవరీ ఏజెంట్ కృష్ణ పాత్రలో కనిపిస్తాను. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ‘చింతకాయల రవి’ సినిమా తర్వాత యోగేశ్ చేస్తున్న సినిమా ఇది. నేను ఫైట్స్ చేస్తే, ప్రేక్షకులు అంగీకరిస్తారా? అనే సందేహం ఉండేది. కానీ, యోగేశ్ ప్రోత్సాహంతో చేశాను. అలాగే, నాకు డ్యాన్స్ చేయడం కూడా పెద్దగా రాదు. శేఖర్, రఘు మాస్టార్ల సహకారంతో చేశాను. ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలైట్. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం, అలాగే రమేశ్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నా’’ అని చెప్పారు. -
జాదూ...
లోన్ రికవరీలో అతను కింగ్. ఎలాంటి వాళ్లనైనా ముప్పుతిప్పలు పెట్టి బాకీ వసూలు చేయగల సమర్థుడు. అలాంటి జాదూగాడినే ఓ ఆటాడిస్తుందో అమ్మాయి. ఆ కథ ఏంటో తెలియాలంటే ‘జాదూగాడు’ చూడాల్సిందే. నాగశౌర్య, సోనారిక జంటగా ‘చింత కాయల రవి’ ఫేం యోగేశ్ దర్శకత్వంలో వి.వి.ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘జాదూగాడు’. ఈ నెలలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘నాగశౌర్య చేసిన గత చిత్రాలకు భిన్నంగా ఇది ఉంటుంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని చెప్పారు. సాగర్ మహతి స్వరాలందించిన పాటలకు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాగర్ మహతి, కథ మాటలు: మధుసూదన్. -
నాన్నగారి పాటల్లా ఉన్నాయంటున్నారు!
‘‘నాకు చిన్నతనం నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. మా తాతగారు వైయన్ శర్మ ప్రముఖ సంగీత వాద్యకళాకారుడు. ఇక మా నాన్న గారు మణిశర్మ గురించి అందరికీ తెలుసు. అలా వారిద్దరి ప్రభావంతోనే నాలో సంగీతాభిలాష ఇంకా పెరిగింది’’ అన్నారు సాగర్ మహతి. ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ కుమారుడు సాగర్ మహతి ‘జాదూగాడు’ చిత్రంతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేస్తు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘కీబోర్డ్ ప్లేయర్‌గా, ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్న నాకు ఈ సినిమాకు పనిచేసే అవకాశం దర్శకుడు యోగి గారి వల్లే వచ్చింది. నా తొలి సినిమా పాటలకు మంచి స్పందన వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా మీద కచ్చితంగా మా నాన్నగారి ప్రభావం 80 శాతం వరకూ ఉంది. మిగతా 20 శాతం సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్ గారిదే. నేను ఆయన దగ్గర చాలా సినిమాలకు పనిచేశాను. ఈ సినిమాకు పనిచేస్తున్నపుడు నాన్నగారికి నా ట్యూన్స్ వినిపించేవాణ్ణి. ఆయనిచ్చిన సలహాలు బాగా ఉపయోగపడ్డాయి. నా పాటలు విన్న ప్రతి ఒక్కరూ అచ్చం నాన్నగారి పాటల్లానే ఉన్నాయంటున్నారు. దాన్ని బెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నా. ప్రస్తుతం ఎస్.వి.కె బ్యానర్లో మధు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రానికి స్వరాలందిస్తున్నా. మ్యూజిక్‌తో ఎంటర్టైన్ చేయడమే నా లక్ష్యం’’ అని చెప్పారు. -
‘జాదూగాడు’ మూవీ స్టిల్స్
-
నా తొలి యాక్షన్ మూవీ ఇది - నాగశౌర్య
‘‘నాగశౌర్య కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత దర్శకుడు యోగేశ్ చేసిన చిత్రం ఇది. మంచి సినిమా తీసి ఉంటాడనే నమ్మకం ఉంది. ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమవుతున్న మణిశర్మ తనయుడు సాగర్ మహతికి శుభాకాంక్షలు’’ అని ‘ప్రసాద్స్’ సంస్థల అధినేత రమేశ్ ప్రసాద్ అన్నారు. నాగశౌర్య, సోనారిక జంటగా యోగేశ్ దర్శకత్వంలో వీవీయన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జాదూగాడు’. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న మణిశర్మ, బి.గోపాల్, కోన వెంకట్, గోపీచంద్ మలినేని, నల్లమలుపు బుజ్జి సంయుక్తంగా పాటల సీడీలను విడుదల చేశారు. ఇంకా ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న దామోదర ప్రసాద్, కల్యాణి మాలిక్, మెహర్ రమేశ్, నందినీరెడ్డి తదితరులు చిత్రబృందానికి శుభాకాంక్షలు అందజేశారు. లవర్‌బోయ్ ఇమేజ్ను పక్కనపెట్టి, తాను చేసిన తొలి యాక్షన్ మూవీ ఇదనీ, అందరూ ఆదరిస్తే కెరీర్‌పరంగా మరో మెట్టు ఎక్కుతాననీ ఈ సందర్భంగా నాగశౌర్య అన్నారు. మంచి సంగీత జీవితాన్ని ప్రసాదించిన మా నాన్నగారికి ధన్యవాదాలనీ, ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానని సాగర్ మహతి చెప్పారు. -
'జాదూగాడు' ఆడియో లాంచ్