ఇదే తొలిసారి! | Naga Shourya with chit chat | Sakshi
Sakshi News home page

ఇదే తొలిసారి!

Published Mon, Jun 22 2015 11:10 PM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

ఇదే తొలిసారి!

ఇదే తొలిసారి!

‘‘ఈ చిత్రంలో నాది మాస్ కేరక్టర్. ఈ తరహా పాత్ర చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చాలా మంది ‘అప్పుడే మాస్ పాత్ర అవసరమా’ అని అడిగారు. కానీ, ఈ సినిమా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాలో నటించాను’’ అని హీరో నాగశౌర్య అన్నారు. యోగేశ్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వీవీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం -‘జాదూగాడు’. శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రవిశేషాలను నాగశౌర్య పంచుకున్నారు.

‘‘ఇందులో బ్యాంక్ రికవరీ ఏజెంట్ కృష్ణ పాత్రలో కనిపిస్తాను. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ‘చింతకాయల రవి’ సినిమా తర్వాత యోగేశ్ చేస్తున్న సినిమా ఇది. నేను ఫైట్స్ చేస్తే, ప్రేక్షకులు అంగీకరిస్తారా? అనే సందేహం ఉండేది. కానీ, యోగేశ్ ప్రోత్సాహంతో చేశాను. అలాగే, నాకు డ్యాన్స్ చేయడం కూడా పెద్దగా రాదు. శేఖర్, రఘు మాస్టార్ల సహకారంతో చేశాను. ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలైట్. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం, అలాగే రమేశ్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నా’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement