Naga Shaurya Mother Usha Clarity on Relationship With Jr NTR family - Sakshi
Sakshi News home page

Naga Shaurya : ఎన్టీఆర్‌ ఫ్యామిలీతో నాగౌశర్యకు ఉన్న రిలేషన్‌ ఇదే..

Published Thu, Apr 7 2022 2:40 PM | Last Updated on Thu, Apr 7 2022 6:03 PM

Naga Shaurya Mother Usha Clarity On Relationship With Jr Ntr And Pranathi - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన శౌర్య ఛలో సినిమాతో మంచి హిట్‌ కొట్టారు. అందంతో పాటు టాలెంట్‌ కూడా ఈ యంగ్‌ హీరోకి ఇప్పటివరకు అనుకున్నంతగా సక్సెస్‌ రాలేదు. తాజాగా కృష్ణ వ్రింద విహారి సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు.చదవండి: ఎన్టీఆర్‌ను డామినేట్‌ చేశారా? చరణ్‌ ఆన్సర్‌ అదిరిందిగా

ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగశౌర్య తల్లి ఉషా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక ఇండస్ట్రీకి అడుగుపెట్టినప్పటి నుంచి శౌర్యకి ఎన్టీఆర్‌ కుటుంబంతో బంధుత్వం ఉందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నాగశౌర్య తల్లి ఉషా క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..శౌర్యకు ఎన్టీఆర్‌ అంటే అభిమానం.

ఇక తారక్‌ భార్య లక్ష్మీ ప్రణతి కజిన్‌కు శౌర్య మంచి ఫ్రెండ్‌. ఆ విధంగా రూమర్స్‌ వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్లు కుటుంబంతో బంధుత్వం లేదు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్‌లా ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నాగ శౌర్యకి ఎన్టీఆర్‌ బంధువు అవుతారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టమైపోయింది. చదవండి: ఇదెక్కడి మాస్‌ మేనియా.. ఎగ్జామ్‌ పేపర్‌లో 'పుష్ప' డైలాగులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement