
టాలీవుడ్ యంగ్ హీరో ఇంట పెళ్లి బాజాలు మోగాయి. యువ కథానాయకుడు నాగశౌర్య సోదరుడు గౌతమ్ ఓ ఇంటివాడయ్యాడు. జూన్ 23న నమ్రత గౌడను వివాహమాడాడు. అమెరికాలో ఎంతో గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు సహా అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.
అయితే గౌతమ్ తమ్ముడు నాగశౌర్య మాత్రం గైర్హాజరయ్యాడు. అతడు యూకేలో షూటింగ్‌లో బిజీగా ఉండటంతో పెళ్లికి హాజరు కాలేనట్లు తెలుస్తోంది. దీంతో శౌర్య తల్లిదండ్రులు వీడియో కాల్ ద్వారా గౌతమ్ పెళ్లిని చూపించారు. ప్రస్తుతం గౌతమ్ పెళ్లి ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
ఇక నాగశౌర్య విషయానికి వస్తే.. ఊహలు గుసగులాడే సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా హిట్ కావడంతో అతడి ఐదేళ్ల నిరీక్షణ ఫలించినట్లయింది. ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూసిన అతడికి అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అతడు నటించిన కృష్ణ వ్రింద విహారి రిలీజ్‌కు రెడీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment